![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-164లో.. రామరాజు, చందులకి శ్రీవల్లి భోజనం తీసుకొని వస్తుంది. ఇక అక్కడ తన డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇక రామరాజు తనకి మంచి కోడలు దొరికిందని సంబరపడతాడు. ఇంట్లో మీకు తెలియకుండా ప్రేమ ట్యూషన్ స్టార్ట్ చేసింది.. నలుగురికి తెలిస్తే మన కుటుంబ గౌరవం ఏమవుతందని రామరాజుకి అన్నీ ఎక్కించి చెప్తుంది శ్రీవల్లి. మరి బుజ్జమ్మ నాకు చెప్పలేదని రామరాజు అనగా.. అత్తయ్యకి తెలుసు వాళ్ళంతా ఒక్కటే అని శ్రీవల్లి అంటుంది.
మరోవైపు వేదవతి దగ్గరికి వచ్చిన ప్రేమ.. మామయ్య గారు రాగానే ట్యూషన్ గురించి మీరే చెప్పాలని అంటుంది. సరేనని వేదవతి అంటంది. ఇక శ్రీవల్లి వాళ్ళని చూసి .. ఆల్రెడీ చెప్పేశాను.. ఇక రణరంగమే అని అనుకుంటుంది. ఇక రామారాజు ఇంటికి రాగానే.. మామయ్య గారు మంచినీళ్ళు తీసుకోండి అని ఇస్తుంది శ్రీవల్లి. తన బిహేవియర్ చూసి వేదవతికి కోపం వస్తుంది. ఇక రామరాజు చేతిలోని డబ్బుల బ్యాగ్ ని శ్రీవల్లి తీసుకుంటుంది. ఆ బ్యాగ్ ఇవ్వు .. నేను బీరువాలో పెడ్తానని వేదవతి అనగా.. నేను పెడ్తాలేండి అత్తయ్య అని శ్రీవల్లి అంటుంది. ఇక రామరాజు వారి మధ్యలో కల్పించుకొని.. తనని బ్యాగ్ తీసుకెళ్ళనివ్వు అని అంటాడు. ఇంతలో ప్రేమ వస్తుంది. మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలని అంటుంది. నువ్వు ఆగమ్మా అని ప్రేమని ఆపిన రామరాజు.. నాకు చెప్పకుండా ఇంట్లో అందరు నిర్ణయాలు తీసుకుంటున్నారా అని వేదవతిని రామరాజు అడుగుతాడు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారండి అని వేదవతి అనగా.. మన ఇంట్లో ఈ అమ్మాయి ట్యూషన్ చెప్తుందంటా.. నిజమేనా అని రామరాజు అంటాడు. అవునండీ.. ప్రేమ కాలేజ్ నుంచి వచ్చిన తరవాత ఖాళీగానే ఉంటుంది కదా.. అందుకే ట్యూషన్ చెప్తానని అడిగింది. అయినా అది మంచి విషయమే కదా అని సరేనని అన్నానని వేదవతి అనగా.. ఓహో ఇంటికి సంబంధించిన విషయాలన్నీ మీరే మాట్లాడుకుని.. మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇక నేనెందుకు.. రేపటి నుంచి నేను రైస్ మిల్లులోనే ఉండిపోతాను.. ఇక అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోమని రామరాజు అంటాడు.
నాన్నా అయిపోయింది కదా.. ఇప్పుడెందుకు ఇంత గొడవా అని చందు అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి.. ఐబాబోయ్.. దేవుడు లాంటి మామయ్యకి ఎదురు చెప్తారేంటి.. అడగనివ్వండీ.. ఆయన అడిగిన దాంట్లో తప్పేం ఉందని శ్రీవల్లి అంటుంది. నువ్వు ఆగు.. నీకేం తెలియదని చందు అనేసరికి.. మీరు ఆగండి బావగారూ.. నేను సమాధానం చెప్తానని ప్రేమ అంటుంది. చూడండి మామయ్యా.. మీకు చెప్పకుండా ట్యూషన్ స్టార్ట్ చేయడం తప్పే.. ఇది కావాలని చేసింది కాదు. పిల్లలు వస్తారో రారో అని అనుకున్నా.. మీ పర్మిషన్ తీసుకునే స్టార్ట్ చేద్దామనుకున్నా. కానీ సడెన్‌గా పిల్లలు వచ్చేశారంటు ప్రేమ గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |